Translate

  • Latest News

    21, మే 2019, మంగళవారం

    జగన్ ను గెలిపించనున్న బి.సి.లు


    పోలింగ్ జరిగి 40 రోజులు దాటింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ మొదలు కానుంది. రాజకీయ పార్టీలు కొన్ని ఎగ్జిట్ పోల్స్ ను కూడా ప్రభావితం చేసి తమకు అనుకూలంగా ఇప్పించుకున్నాయి. తద్వారా ఓటర్లను కౌంటింగ్ రోజు దాకా మళ్ళీ టెన్షన్ లో పడేశాయి. ఎగ్జిట్ పోల్స్ అనంతరం పలు చానెల్స్ లో రకరకాలుగా చర్చలు, వ్యాఖ్యానాలు కూడా మనం విన్నాము. అయితే ఎందరు ఎన్ని రకాలుగా అంచనాలు వేసినా... సర్వేలు చేసినా... పసుపు కుంకుమలు, వృద్దాప్య పెన్షన్లపై లెక్కలు వేసి, కిందా..మీదా పడినా... వీటన్నిటి కంటే ఈ సారి ఎన్నికల్లో అత్యంత ప్రభావితం చూపించి జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతున్నది బి.సి.లే... ఇది ముమ్మాటికీ నిజం. సహజంగా తెలుగుదేశం పార్టీకి, వై.ఎస్.ఆర్.సి.పీ కి ఎవరి ఓట్ బ్యాంకు వారికి ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం ఓట్ బ్యాంకు అయిన బి.సి లలో నుంచి కొంత శాతం చెదిరి వై.ఎస్.ఆర్.సి.పీ వైపు వచ్చింది. అదిగో... సరిగ్గా...ఆ బి.సి. ఓటు శాతమే జగన్ ను ముఖ్యమంత్రిని చేయనుంది. 
    గత 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బి.సి.లలో పూర్తిగా కాకపోయినా...చెప్పుకోదగ్గ స్థాయిలో  ఈసారి జగన్ ను భుజాన వేసుకున్నారు. అందుకే చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా జగన్ గెలుపు కేక్ వాక్ అయింది. మూడింట రెండు వంతుల మెజారిటీతో వై.ఎస్.ఆర్.సి.పీ గెలవబోతోంది. ఇందుకు ప్రధాన కారణం బి.సి. డిక్లరేషన్... భిన్నస్వరం గతంలోనే చెప్పింది బి.సి. డిక్లరేషన్ చరిత్రాత్మకం  అని... పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి జగన్ బి.సి లకు వరాలు ప్రకటిస్తూ వచ్చారు. బి.సి.లకు ఆదరణ లాంటి పథకాలతో మిఠాయిలు, పప్పు బెల్లాలు పంచడం కాదు... బి.సి.లను సామాజికంగా...ఆర్ధికంగా... రాజకీయంగా కూడా పైకి తీసుకురావాలనే సదాశయంతో జంగా కృష్ణమూర్తి తో ఒక అధ్యయన కమిటీ వేసి దాదాపు ఏడాదికి పైగా రాష్ట్రం లోని అన్ని జిల్లాలు తిరిగి బి.సి. ల లోని దాదాపు 130 కులాలతో విడివిడిగా సమావేశమై... వారి వారి సమస్యలు..మూలాలు తెలుసుకుని వారికి సరైన న్యాయం జరగాలంటే ఏం చేయాలో అలోచించి ఆ మేరకు ప్రణాళిక రూపొందించి బి.సి.డిక్లరేషన్ తయారుచేశారు. అందులో ప్రధానమైనది నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో బి.సి..ఎస్.సి.ఎస్.టి, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ అనేది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. జగన్ నిజాయితీని అర్ధం చేసుకున్న బి.సి.లు ఈసారి ఎన్నికల్లో జగన్ కు జై కొట్టారు... అందుకే చంద్రబాబు ఎన్నికల ముందు ప్రభుత్వ సొమ్ముతో డ్వాక్రా మహిళలకు లంచాలు ఇచ్చి లబ్ది పొందాలని చూసినా, ఎన్నికలకు రెండు నెలల ముందు వృద్ధాప్య పింఛనులు 3 వేలకు పెంచినా.. అధికారులను అడ్డం పెట్టుకుని.. సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించైనా సరే ఎన్నికల్లో ఎలాగయినా గెలవాలని చూసినా బి.సి. ల మద్దతుతో జగన్ ఈసారి తిరుగులేని విజయాన్ని పొందనున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ ను గెలిపించనున్న బి.సి.లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top