Translate

  • Latest News

    3, మే 2019, శుక్రవారం

    రాలుతున్న మొగ్గ‌లు... ఆక‌లి చావులకు అంతం ఎక్క‌డా...?




    ఇప్పుడు లెక్క‌లు క‌ట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఓట్ల కోసం పంచిన నోట్ల లెక్క‌లు కాదు. క‌ర్మ‌భూమిలో పుట్టి ముద్ద కోసం ప‌రిత‌పించి త‌నువు చాలించిన అభ్యాగుల ఆక‌లిచావుల గురించి  లెక్క‌లు తేల్చాల్సిందే. అమ‌రావ‌తి నిర్మాణం గురించి, సాధించిన ప్ర‌గ‌తి గురించి మన వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పే రామరాజ్యంలోనే అన్నమో రామచంద్రా... అని ఆకలి కేకలు వినిపించాయి. అలాగే అన్నిట్లో మేమే నంబర్ 1 అని చెప్పుకునే చంద్రబాబు  పాలనలో అనంతపురం జిల్లాలో ఓ పసిపాప ఆకలి చావు రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. తినడానికి తిండి లేక మట్టి తిని అనారోగ్యం పాలై మరణించిందన్న వార్త విని ఏ మాత్రం మానవత్వమున్న హృదయాలన్ని క‌దిలించింది. అనంతపురం జిల్లా కదిరి మండలంలో ఈ ఆకలిచావు నమోదైంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలితో అలమటించింది. తినడానికి అన్నం లేక.. మట్టి తిని అనారోగ్యం పాలైంది. చివరికి కన్నుమూసింది.దేశం వెలిగిపోతోంది, ఆరో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్, దేశ జీడీపీలో ఎన్నడూలేని వృద్ధి... స్మార్ట్ సిటీలు, విశ్వనగరాలు, ఉచిత వైఫైలు దేశాభివృద్ధి సూచీలుగా నిలుస్తున్నాయి నేడు... కాని  ఆకలి చావుల విషాదగాథ మన ప్రస్తుత పరిస్థితిని చెప్పక చెబుతోంది
    ఈ విష‌యాల‌పై దృష్టి సారించండి... 

     70 ఏళ్ల స్వతంత్య్ర భారతావనిలో ఇలాంటి హృదయవిదారక ఘటనలు  కోకొల్ల‌లు. అయితే పాల‌కుల‌కు  కూసింత చిత్తశుద్ధి, కాస్తంత సద్భుద్ది ఉండి ఉంటే ఆకలి చావులు, పోషకాహార లోపం లాంటి సమస్యలు దేశ పౌరులు ఎదుర్కొనేవారు కాదు. కాని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడోవంతు అన్నార్థులు మన దేశంలో ఉన్నారు. ప్రతి రోజు మాడిన డొక్కలతో నిద్రిస్తున్న దౌర్భాగ్య భారతీయుల సంఖ్య 20 కోట్లు.  
    ప్రతి రోజూ 7000 మంది దేశ పౌరులు ఆకలిచావు కోరల్లో చిక్కుకుంటున్నారు, ఏడాదికి 25 లక్షల మంది అన్నార్థులు ఆకలికి బలవుతున్నారు, మరో వైపు 1.44 కోట్ల మంది పిల్లలు ఒబెసిటీతో బాధపడుతున్నారు...  యుఎన్ ఫుడ్ ప్రోగ్రాం, డబ్లుహెచ్‌వో, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లాంటి ప్రముఖ సంస్థలందించిన లెక్కలే పైవన్నీ. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్, మలేరియా, టీబీ లాంటి రోగాల బారిన పడి మరణిస్తున్నవారి కంటే ఆకలితో చనిపోతున్న వారి సంఖ్యే  ఎక్కువగా ఉంది. ఇలాంటి మరిన్ని గగుర్పొడిచే నిజాలను చదివేందుకు మనసును దిటవు చేసుకోండి...


    ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు సెకండ్లకు ఒకరు ఆకలి చావుకు గురవుతున్నారు, ప్రతి రోజు 21,000 మంది మరణిస్తున్నారు.
    మన దేశంలో 836 మిలియన్ల మంది జీవించేందుకు ప్రతి రోజూ ఖర్చు చేస్తున్నది రూ.20.
    తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరు ఖాళీ కడుపుతో నిద్రిస్తున్నారు అంటే దేశవ్యాప్తంగా 230 మిలియన్ల మంది
    ఆకలిని తరిమి ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నా  అవి ఆకలిచావులను ఆపలేకపోతున్నాయి, లోపం ఎక్కడో పసిగట్టలేని ప్రభుత్వాలు కావు మనవి, కాని అరికట్టడానికి కూసింత చిత్తశుద్ధి, కాస్తంత సద్భుద్దీ అవసరం. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రాలుతున్న మొగ్గ‌లు... ఆక‌లి చావులకు అంతం ఎక్క‌డా...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top