Translate

  • Latest News

    7, మే 2019, మంగళవారం

    ఓటమిని ఒప్పుకున్న చంద్రబాబు


    తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి ని ఎగతాళి చేయడానికి మాట్లాడినా ఒక నిజాన్ని స్పష్టంగా  ఒప్పుకున్నారు. చంద్రబాబు సోమవారం మంగళగిరి హాపీ రిసార్ట్స్ లో అమలాపురం పార్లమెంట్ పరిధి లోని అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేతలతో జరిగిన సమీక్ష సమావేశంలో పార్టీ నాయకుల్లో ఉన్న నైరాశ్యాన్ని వదిలించడానికి, పార్టీ నాయకులను నవ్వించడానికి ఒక జోక్ చెప్పారు.
    అదేమిటంటే... ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇటీవల జైల్లో పనిచేసే  ఒక కానిస్టేబుల్ కు లిఫ్ట్ ఇచ్చాడట... మాటల్లో ఆ కానిస్టేబుల్ తాను జగన్ కు ఓటు వేశానని చెప్పాడట.. ఎందుకు వేశావని అడిగితే... 16 నెలలు జైల్లో ఉన్నారు కదా... జైలు సిబ్బంది సాధక బాధకాలు ఆయన కంటే ఎక్కువగా రాష్ట్రంలో ఏ నాయకుడికి తెలియవని చెప్పాడట... ఈ జోక్  చెప్పి చంద్రబాబు ఒక ఎగతాళి నవ్వు నవ్వి పార్టీ నాయకులందరినీ నవ్వించాడట... అయితే ఈ జోక్ చెప్పడం ద్వారా చంద్రబాబు ఒక నిజాన్ని చెప్పకనే చెప్పారు. 16 నెలలు జైల్లో ఉన్నట్టే... 14 నెలలు పాదయాత్ర పేరుతొ జగన్ తన కుటుంబాన్ని వదిలి పూర్తిగా జనంలోనే ఉన్నారు. జనం కస్టాలు ఆయనకు తెలిసినంతగా రాష్ట్రంలో మరే నాయకుడికి తెలియవన్నది నిజం. చంద్రబాబు చెప్పినట్టు ఆ జైలు కానిస్టేబుల్ జగన్ కు ఓటు వేసినట్టే.... రాష్ట్ర ప్రజలంతా ఈసారి అదే విధంగా ఆలోచించి తమ కష్టాలు బాగా తెలిసిన జగన్ కు  ఓటు వేశారన్నది కాదనలేని సత్యం. జైలు కానిస్టేబుల్ జోక్ చెప్పడం ద్వారా చంద్రబాబు కౌంటింగ్ కు ముందే తన ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నారు.
    ఎందుకింత ఆపసోపాలు... 
    55 వేల మంది బూత్ కమిటీ కన్వీనర్లు, 4 లక్షల మంది సేవామిత్రలు, 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం. ఇంత బలమైన పార్టీ మరి ఇప్పుడెందుకు గెలుపు కోసం ఇంత ఆపసోపాలు పడుతోంది... 55 వేల మందితో 78 సార్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించామని సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే చెప్పారు. అన్నిసార్లు టెలి కాన్ఫరెన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. గెలుపుపై నమ్మకం లేకనే కదా... పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు మంగళగిరి హాపీ రిసార్ట్స్ లో రోజుల తరబడి సమీక్షలు చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది. ఎన్ని కోణాల్లో చూసినా.. ఎన్ని నివేదికలు తెప్పించుకున్నా... మళ్ళీ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఏ కోశానా కనపడకే కదా...
    తెగించి చెప్పిన చౌదరి...
    సార్... ఆ తప్పు మళ్ళీ చేయొద్దు... అని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ పార్టీ నాయకుడు వి.వి.వి.చౌదరి తమ పార్టీ అధినేతకు తెగించి చెప్పేశారు. అదేమిటంటే... మేము కష్టపడి పార్టీని గెలిపిస్తే.. ఆ తర్వాత ఎం.ఎల్.ఏలు, ఎం.పీ ల ఇళ్లలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కనపడుతున్నారు. పార్టీని గెలిపించిన వారిని వదిలేసి, ఇతర పార్టీల నించి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారు. మేము ఎవరిపైన పోరాడామో వారినే తీసుకువచ్చి మా పైన కూర్చోబెడితే బాధగా ఉంటోంది. మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా చూడండి... అని చంద్రబాబును కోరడం గమనార్హం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఓటమిని ఒప్పుకున్న చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top