Translate

  • Latest News

    22, జూన్ 2019, శనివారం

    భ‌విష్య‌త్ చిత్ర‌ప‌టాన్ని ఆవిష్క‌రిస్తున్న భిన్న‌స్వ‌రం


    జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే, భ‌విష్య‌త్‌లో జ‌రగ‌నున్న అంశాల‌ను ప‌సిగ‌ట్ట‌డం సులువౌతుంది. ఇదేదో జ్యోతిష్య శాస్త్రం కాదు. శాస్త్రీయ అలోచ‌న ధోర‌ణి ఉంటే ఇవ‌న్నీ సాధ్య‌మే. ఇప్పుడు టీడీపీ సంక్షోభంలో ఉంది. ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న పార్టీ ముక్క‌చెక్క‌ల‌య్యే ప‌రిస్థితి దాపురించింది. కేంద్రంలో న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీ గూటికి చేరారు. ఇటు రాష్ట్రంలోనూ ఇదే త‌ర‌హ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. మ‌రోవైపు బీజేపీ ఏపీలో పాగా వేయ‌టానికి సిద్ద‌మైంది. ఈ అంశాల‌ను భిన్నస్వ‌రం ముందుగానే అంచ‌నా వేసింది. నెల‌కు ముందే ఆ అంశాల‌పై క‌థ‌నాలు వెలువ‌రించింది. ఇదంతా సొంత డ‌బ్బా కొట్టుకోవ‌టానికి చెప్ప‌టం లేదు. భిన్నస్వ‌రంను అనుస‌రించే నెటిజ‌న్ల‌కు ఈ వెబ్‌సైట్ నిబద్ద‌త గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలియ‌ని పాఠ‌కుల‌కు విష‌యాన్ని తెలియ‌జేయ‌ట‌మే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. 

    ప్ర‌స్తుత టీడీపీ ప‌రిస్థితిని ముందుగానే ఉహించి... మే 23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలు..? అనే క‌థ‌నాన్ని వెలు వ‌రించాం.ఈ లింక్ ఇక్క‌డ చూడ‌వ‌చ్చు.http://www.bhinnaswaram.com/2019/04/23.html... మే 23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలు కానుందా ... ఏమో జరిగినా జరగవచ్చు...  ఇప్పటికే టీడీపీ సీనియర్ నాయకుల్లో అంతర్మథనం  మొదలైనది. నిన్న మొన్నటి వరకు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలివితేటల మీద...ఆయన రాజకీయ చాణిక్యం మీద ప్రగాఢ విశ్వాసమున్న ఆ పార్టీ నేతల్లో క్రమేపీ ఆ విశ్వాసం సన్నగిల్లుతూ వస్తోంది. ఇటీవల కాలంలో చంద్రబాబు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తీసుకుంటున్న వైఖరి, నిర్ణయాలు అన్నీ వరుసగా బెడిసికొడుతుండడం... నవ్వులపాలవుతుండడంతో అసలు చంద్రబాబుకు ఏమైంది... అని ఆలోచనలో పడ్డారని వివరించాం. దీంతో పాటు  ప్రతి ఐదేళ్లకు అప్పటి పరిస్థితులను బట్టి జనం మూడ్ ఎలా ఉందో  కనిపెట్టి పొత్తులు పెట్టుకుని లాభపడి, రాష్ట్రంలో తన ముఖ్యమంత్రి పదవికి ఢోకా లేకుండా చేసుకుని అపర చాణిక్యుడు అనిపించుకున్న చంద్రబాబు... ఈ సారి మాత్రం దేశ రాజకీయాలను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు అంటూ ప్ర‌జ‌ల నాడిని తెలియ‌జేశాం. 

    మే 29వ తేదీ ఈనాటి బీజేపీ వ్యూహాన్ని ముందే ప‌సిగట్టి ... ఇక ఏపీపై బి.జె.పీ కన్ను.. అనే శీర్షిక‌న క‌థ‌నాన్ని వెల‌వ‌రించాం. ఈ క‌థ‌నాన్ని ఈ లింక్‌లో చూడ‌వ‌చ్చు. http://www.bhinnaswaram.com/2019/05/blog-post_29.html..  చంద్రబాబు చరిష్మా మసకబారిపోయిన నేపథ్యంలో ఆయన నాయకత్వంపై తెలుగుదేశం పార్టీలో విశ్వాసం క్రమేణా సన్నగిల్లుతోంది. ఇదే అదనుగా బి.జె.పీ అధిష్టానం తెలుగుదేశం నాయకులను  ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అధికారానికి అలవాటు పడిన వారు ఇప్పుడు అధికారం లేకుండా ఉండలేరు... అలా అని చూస్తా...చూస్తా... వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరలేరు... కొద్దో...గొప్పో... నాలుగేళ్లు సహజీవనం చేసిన బి.జె.పీ లో చేరడానికి వారికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు... అంటూ ప్ర‌స్తుత రాజ‌కీయ చ‌రిత్ర‌ను ముందే ఆవిష్క‌రించాం. త‌ర్కానికి అంద‌ని అభూత క‌ల్ప‌న‌ల‌ను చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా చేసి వెబ్‌సైట్ ట్రాఫిక్ పెంచుకోవ‌టానికి మేము సిద్దంగా లేం.  మా వెబ్ సైట్ లో రాసేవన్నీ అక్షర సత్యాలుగానే ఉంటాయి.. నిబద్ధతతోనే కూడి ఉంటాయి. నిఖార్సయిన రాతలుగానే ఉంటాయని మరోసారి నొక్కి వక్కాణిస్తున్నాం. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భ‌విష్య‌త్ చిత్ర‌ప‌టాన్ని ఆవిష్క‌రిస్తున్న భిన్న‌స్వ‌రం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top