Translate

  • Latest News

    25, జూన్ 2019, మంగళవారం

    జగన్ బాబూ...జాగ్రత్త నాయనా...



    మరీ ఇంత నిక్కచ్చిగా ఉంటానంటే ఎలా... అందరూ నీ మీద కచ్చి పెట్టుకోరూ... కాస్త జాగ్రత్త జగన్ బాబూ... నువ్వు చెప్పెందంతా వినడానికి బాగానే ఉంది.. కానీ...ఈ పాడు లోకం... నిన్ను ఎంతవరకు చేయనిస్తుందనేదే నా అనుమానం... మీ నాన్న కూడా మొదటి ఐదేళ్లు కాస్త చూసి చూడనట్టు పోయాడు... రెండోసారి గెలిచాక ఇప్పుడు నువ్వన్నట్టే కాస్త నిక్కచ్చిగా చేద్దామనుకున్నాడు.. అందుకే రచ్చబండ పెట్టాడు... కాకినాడ గ్యాస్ విషయంలో మేము చెప్పిన రేటుకే ఇవ్వాలని ఏకంగా అంబానికే రూలు పెట్టాడు. ఏం జరిగిందో ఆ ఏడుకొండలవాడికే ఎరుక... కొండలు...అడవుల మధ్యలో పెద్దాయన అదృశ్యమైపోయాడు... ఈ లోకంలో మంచి చేద్దామనుకున్న వారిని ఎవరినీ బతికి బట్టకట్టనివ్వరు నాయనా... లోగడ... పెద్ద ఎన్ టీ ఆర్... ఒకసారి... ఓడి ... రెండోసారి 1994లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక.... ఆడోళ్ళ బాధలు చూసి... వాళ్లకు ఏదో మేలు చేయాలనుకుని... ఇప్పుడు నువ్వనుకున్నట్టే సంపూర్ణ మద్య  నిషేధం పెట్టాడు... నీకు తెలుసు కదా... మన రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చేది లిక్కర్ ద్వారానే... మరి లిక్కర్ సామ్రాట్టులు అంతా చేతులు ముడుచుకు కూర్చోరు కదా... వాళ్ళ అండదండలన్నీ చంద్రబాబుకు బలమయ్యాయి...అయితే  ఎన్ టీ ఆర్. లాంటోడిని...దించాలంటే ఎలా... అప్పుడు సరిగ్గా నెపోలియన్ సూత్రం అమలుచేశారు... ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలని. అదే పని చేశారు... రాజగురువు రామోజీ అండతో... లక్ష్మీ పార్వతి ని బూచిగా చూపించి... ఎన్ టీ ఆర్.పూర్తిగా ఆమె ట్రాప్ లో పడి పోయాడని.. పార్టీని రక్షించుకోవాలంటే చంద్రబాబును ముఖ్యమంతిరిని చేసుకోవాలని ఉద్బోధించారు. వారి పాచిక పారింది... లక్ష్మి పార్వతి కోసమే ఎన్ టీ ఆర్. ని దించారని పాపం పిచ్చి ప్రజలు నమ్మేశారు... చంద్రబాబును హీరోగా భ్రమించారు. మరి మద్య  నిషేధం ఎందుకు ఎత్తేశావ్ అని ఎవరూ అడగలేదు... లిక్కర్ సామ్రాట్టులు కింగ్ లు అయ్యారు... చంద్రబాబుకు అనుంగు మిత్రులయ్యారు... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు... ఎం.ఎల్.ఏ లు, ఎం.పీ లు అయ్యారు. బాబుకు కుడి, ఎడమ భుజాలయ్యారు.. ఇదంతా పాపం పిచ్చి జనాలకేం తెలుసు... వారికి రామోజీ ఏమి  చెబితే అదే వేద వాక్కు అన్నట్టుగా ఆ మైకంలో పడిపోయారు...
    ఇప్పడు నా భయం కూడా అదే నాయనా... నువ్వు మద్య  నిషేధం అంటున్నావు... అవినీతిని ఏ  స్థాయిలో సహించనంటున్నావు... కరకట్ట మీద స్వామీజీల ఆశ్రమాలు, రియల్టర్ల గెస్ట్ హౌసులు కూల్చేస్తానంటున్నావ్.. ఇన్నాళ్లు సమాజం అంతా  అవినీతి బురదలో పొర్లాడుతూ ఉంది.. నువ్వు ఒక్కసారిగా శుభ్రం చేస్తానంటే వీళ్లంతా ఒప్పుకోవద్దూ... అలాంటి వారంతా మళ్ళీ టీ డీ పీ లేదా.. బి.జె.పీ లో చేరి... మళ్ళీ నీ మీద కత్తులు నూరతారు... అంత మాత్రాన ఏమీ కాదులే కానీ... ఎన్నికల ముందు ఎయిర్ పోర్ట్ లో హత్యాయత్నానికి ఒడిగట్టినట్టు... మళ్ళీ ఏదయినా  చేయచ్చు... నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్నికలు అయ్యాక నీ తాడేపల్లి ఇంటి దగ్గర కూడా నీ మీద రెక్కీ జరిగిందట.. జాగ్రత్త...నాయనా... ఈ పాడు మనుషులు ఏమి చేయడానికయినా వెనుకాడరు...
    జగన్ బాబూ...జాగ్రత్త నాయనా... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ బాబూ...జాగ్రత్త నాయనా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top