Translate

  • Latest News

    29, జూన్ 2019, శనివారం

    సెల్...గో..టు...హెల్...


    మనమంతా ఇప్పుడు సెల్ అనే ఒక వస్తువు చేతిలో బానిసలుగా మారిపోయాం. మనకు తెలియకుండానే మనల్ని కొంచెం...కొంచెంగా మార్కెట్ తిమింగలం మింగేస్తోంది... ఏడాది, రెండేళ్ల కిందటి దాకా  5 వేల  లోపు ఫోన్ వాడిన మనమంతా... ఈ రెండేళ్ల నుంచి... 3 జి, 4 జి... మాయలో పడి ... 15 వేల ఫోన్లకు షిఫ్ట్ అయిపోయాం... ఇప్పుడు త్వరలో 5 జి వస్తోంది... 5జి సేవలు మనం పొందాలంటే ఇప్పుడు మనం వాడే ఫోన్లు పనికిరాకపోవచ్చు... అప్పుడు మనం మళ్ళీ 20 వేలు, 25 వేలు  ఫోన్ కి షిఫ్ట్ అవ్వాలి .మనం అంత డబ్బులు పెట్టి  ఒకేసారి కొనలేము కాబట్టి... కంపెనీలు మన పట్ల ఎంతో ఉదారంగా... పెద్ద మనసుతో ఆలోచించి... మన సౌకర్యార్ధం... మన కోసం.... మన సుఖం కోసం... ఈ ఎం ఐ సదుపాయం కల్పిస్తాయి... సో... మనం ఎగిరి గంతేసి... 20 వేలేం ఖర్మ...ఎలాగో ఈ ఎం ఐ యే కదాని... 25 వేల ఫోన్ కొనేస్తాం... మన నెల జీతం కంటే మనం వాడే ఫోన్ ఖరీదు ఎక్కువ అన్న సంగతి ఆ క్షణాన ఏ మాత్రం ఆలోచించం... ఆ రకంగా అసలు మనల్ని ఆలోచించనీయకుండా... మన మెదడుని...మన ఆలోచనల్ని కూడా మార్కెట్ నియంత్రణ చేసేస్తుంది... మన బతుకు మన చేతుల్లో లేదు... మార్కెట్ చేతుల్లో ఉంది. అది ఎట్లా చెబితే...అట్లా ఆడాల్సిందే... ఇప్పటికే మన నిత్య  జీవితాల్లోకి సెల్ ప్రవేశించి.... కాదు దురాక్రమణ చేసి.. మన జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది... మానవ సంబంధాల్ని విచ్ఛిన్నం చేసింది. కాపురాల్ని కూల్చింది... ఎంతో మంది ఆడపిల్లల బతుకులు బుగ్గి పాలు చేసింది. టోటల్ గా  వ్యవస్థనే సర్వనాశనం చేసింది. ఇప్పుడు 5జి కూడా వస్తోంది... సమాజంలో మిగిలిఉన్న ఆ కాస్త  విలువల్ని కూడా వలువలు ఊడదీసి నడిరోడ్డులో నగ్నంగా నిలబెట్టడానికి మన మధ్యకు వచ్చేస్తోంది... బీ...రెడీ... అన్నిటికి సిద్ధమైపోండి... సిగ్గు...ఎగ్గులు అన్నీ వదిలేసి... పెగ్గులు మీద పెగ్గులు వేసేసి... పబ్బుల్లో దూరేసి... మగ్గు మంచినీళ్లు దొరకక పోయినా... కేసులు...కేసులు... బీర్లు భేషుగ్గా దొరికే ఈ సమాజంలో... మత్తులో...గమ్మత్తుగా...చిత్తయిపోతూ... ఈ ఆధునిక సమాజంలో.... బతుకంటే... మనల్ని...మనమే బానిసలుగా చేసుకుని... బానిసగా బతికేయడం అని నమ్మి... ఆఫీసులో ఎంత మంచి బానిస అనిపించుకుంటే... మన జీతం అంత  పెరుగుతుంది.... ప్రమోషన్లు వస్తాయనే ఆర్ధిక సూత్రాన్ని బలంగా నమ్మిన బానిస సోదరులంతా... అదే బాటలో దిగ్విజయంగా ముందుకు సాగిపోతూ... 5జి... లు... ఆ తర్వాత... 6జి..లు.. 7 జి..లు, 8 జి.లు వస్తే ఎప్పటికపుడు అప్ డేట్ అవుతూ....ఇదే కదా జీవితం...అనుకుంటూ మార్కెట్ కబంధ హస్తాల్లో... ఆ దృతరాష్ట్ర కౌగిలిలో... తన్మయులై పోండి ...  అంతేగా... అంతేగా... అంతేగా... 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సెల్...గో..టు...హెల్... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top