Translate

  • Latest News

    4, జులై 2019, గురువారం

    నంగనాచి కబుర్లు ఇకనైనా కట్టిపెట్టు బాబూ...


    బాబూ...చంద్రబాబూ... ఇకనైనా నీ నంగనాచి కబుర్లు కట్టిపెట్టు... ఏమిటి నాయనా... ప్రజలు నిన్నెందుకు ఓడించారో నీకు ఇంకా అర్ధం కావడం లేదా... ఎన్నికల్లో ప్రజా తీర్పు చూస్తే బాధగా ఉందా... ఎన్నికలు జరిగి మూడు నెలలు అవుతున్నా ... ప్రజలు నిన్నెందుకు ఓడించారో అర్ధం కావడం లేదా... నువ్వు ఈ ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేసావే తప్ప...ఎటువంటి తప్పు చేయలేదా... ఏమి నంగనాచి కబుర్లు చెబుతున్నావు బాబూ... చింత చచ్చినా... పులుపు చావలేదన్నట్టు... ఇంట జరిగినా... నీలో ఏ కోశానా పశ్చాత్త్తాపం కనపడడం లేదు... మోడీ ఏదో మాయ చేశాడు...   నీ మీద కక్షతో...జగన్ మీద ప్రేమతో ఆంధ్ర లో ఈ.వీ.ఎం లను మానేజ్ చేశాడు. అందుకే... ఓడిపోయానంటున్నావే... తప్ప... ఈ ఐదేళ్లలో నువ్వు...నీ అనుచరగణం చేసిన అరాచకాలతో జనం కడుపుమండి  ఓడించారన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు... ఆ నిజం... తెలిసి... తెలియనట్టు నాటకమాడుతున్నావు... 2014 లో నేను మారాను... నన్ను... నమ్మండి... అంటే.. పిచ్చి జనం నమ్మేసి.. నిన్ను గెలిపించారు... ఆ తరువాత వారికి  నీ నిజరూప దర్శనం అయింది. ఇప్పుడు... మళ్ళీ ఓడినాక కూడా నీ ధోరణి ఏ మాత్రం మారలేదు... నువ్వు ఛస్తే మారవని ఈ జనానికి బాగా అర్ధమై పోయింది... పుట్టుకతో వచ్చింది... పుడకతో కానీ పోదనే... సామెత తెలుగువారందరికీ బాగా తెలుసు కదా.. ఇక నిన్ను ఛస్తే నమ్మరు...

    నీకన్నా... ఆ రాహులే నయం... 
    మాట్లాడితే నేను 40 ఏళ్ళ సీనియర్ ని అంటావు... నీకన్నా... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే నయం... పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు. ఎంతమంది బతిమాలినా వెనక్కి తగ్గలేదు... పార్టీ ఓటమిపై పార్టీలో ఆత్మపరిశోధన జరగాల్సిందేనంటున్నాడు... అతనిలో పశ్చాత్త్తాపం కనపడుతోంది... అయితే... తన ప్లేస్ లో ఆ  ముసలి నాయకులు సుశీల్ కుమార్ షిండెనో... మల్లిఖార్జున్ ఖడ్గే నో... లేదా.. మోతీలాల్ ఓరే నో పార్టీ అధ్యక్షుడిగా పెట్టినంత మాత్రాన ఒనగూరే ప్రయోజనం ఏమీ  లేదు... లోగడ సీతారాం కేసరి ని పెట్టి ఏమి సాధించారు.. చివరికి మళ్ళీ సోనియా గాంధీ నే పార్టీ పగ్గాలు తీసుకోవాల్సి వచ్చింది... తరతరాలుగా నెహ్రూ, గాంధీ కుటుంబాలకు వీర విధేయులుగా ఉంటూ వస్తున్న ఆ కురువృద్ధులు కొత్తగా ఆలోచించలేరు.. అలా కాకుండా.. కాంగ్రెస్.. ఈ తరం జనరేషన్ కి దగ్గర అవ్వాలంటే... యువతరం చేతుల్లోనే పార్టీ పగ్గాలు ఉండాలి.. అయితే ఆ యువ నాయకుడు ఎక్కడ రాహుల్ ని మించి ఎదిగిపోతాడో అని వారికి భయం... అందుకే... ముసలోళ్ల చేతిలో పగ్గాలు పెడితే... మళ్ళీ జాగ్రత్తగా మనకే అప్పగిస్తారనే ఒక దురాలోచన...దూరాలోచన... ఇటువంటి... పిచ్చి పిచ్చి ఆలోచనలతోనే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ దుస్థితి సంభవించింది... ఇప్పటికయినా అటువంటి మూస ఆలోచనల్లో నుంచి కొత్తగా ఆలోచించకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు  ఉండదు...
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నంగనాచి కబుర్లు ఇకనైనా కట్టిపెట్టు బాబూ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top