Translate

  • Latest News

    11, జులై 2019, గురువారం

    ప్రియాంక వచ్చి చేసింది లేదు... బ్రహ్మణి వచ్చి చేసేదేమీ లేదు...


    కుటుంబ పార్టీలు ఆ కుటుంబ చట్రం నుంచి బయటకు రానంత కాలం... ఆయా పార్టీలకు మనుగడ లేదు. నాయకులు ఆయా కుటుంబ సభ్యులనే దేవుళ్ళు, దేవతలుగా ఆరాధిస్తూ... వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ... వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే... వారి ప్రాభవం ఉన్నంతకాలం ఓకే... ఆ తర్వాత ఏ శక్తులు కాపాడలేవు... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి... నెహ్రు, గాంధీ ల కుటుంబంపై ఆధారపడింది... ఇప్పుడు ఆ కుటుంబంలో నాల్గవ తరానికి చెందిన రాహుల్ గాంధీ హయాంలో ఎన్నడూ లేనంత దురవస్థలో ఉంది... ఆఖరకు ప్రియాంక గాంధీ ని రంగంలోకి దింపితే ఏదో  మహత్యం జరుగుతుందన్న పిచ్చి భ్రమలో నిన్నటి దాకా ఆ పార్టీ వాళ్ళు ఉండేవారు... ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో యూ.పీ లో ఆమె ఎంత ప్రచారం చేసినా తన సొంత  అన్న, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా   గెలిపించుకోలేక పోయింది... దీంతో ఆ పార్టీ నాయకులకు ప్రియాంక మీద ఉన్న భ్రమలు కూడా తొలగిపోయాయి...
    కేంద్రంలో కాంగ్రెస్ కు పట్టిన గతే ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పట్టింది... అక్కడ రాహుల్ పప్పు అని... ఆయన వల్ల కావడం లేదని ప్రియాంకను ముగ్గు లోకి దించారు.. అయినా ఫలితం లేదు. ఇక్కడ లోకేష్ పప్పు అని...ఆయన భార్య, సినీ నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి ని రాజకీయాల్లోకి దింపుతారనే వార్తలు వినపడుతున్నాయి... అక్కడ ప్రియాంక వచ్చి చేసింది లేదు... ఇక్కడ బ్రహ్మణి వచ్చి చేయగలిగింది ఏమి ఉండదనే సత్యాన్ని ఆ పార్టీ గ్రహించాలి. రోజుకో నాయకుడు ఆ పార్టీకి గుడ్ బై చెబుతూ... కాషాయ కండువా కప్పుకొంటుంటే... ఇప్పటికే ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి  బ్రహ్మణి మంత్రంతో చింతకాయలు కూడా రాలవనే నిజాన్నిఎంత త్వరగా  గ్రహిస్తే అంత మంచిది.. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రియాంక వచ్చి చేసింది లేదు... బ్రహ్మణి వచ్చి చేసేదేమీ లేదు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top