Translate

  • Latest News

    17, ఆగస్టు 2019, శనివారం

    అతిపెద్ద థియేటర్‌లో సాహో


    యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సాహో ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ప్యారిస్‌ నగరంలోని ప్రఖ్యాత థియేటర్‌గా పేరుపొందిన ‘ది గ్రాండ్‌ రెక్స్‌’లో ప్రదర్శనకు సాహో ఎంపికయ్యింది. ఈనెల 30న సాహో విడుదల కానున్న నేపథ్యంలో ఆ థియేటర్‌ గోడలపై సాహో వీడియోలతో ఇప్పటికే ప్రచారం మొదలయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అతిపెద్ద థియేటర్‌లో సాహో Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top