Translate

  • Latest News

    16, ఆగస్టు 2019, శుక్రవారం

    రోజూ వద్దు.. వారానికోసారి ముద్దు



    శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒక్కసారి మాత్రమే సెక్స్‌ చేసుకునే జంటలు ఎక్కువ ఆనందంగా గడుపుతున్నాయట. సొసైటీ ఫర్‌ ది పర్సనాలిటీ అండ్‌ సోషల్‌ సైకాలజీ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

    ‘ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే అంత ఎక్కువ హ్యాపీగా ఉంటామని చాలా మంది అనుకుంటారు. అది తప్పు. నిజానికి తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారే ఎక్కువ హ్యాపీగా ఉంటారు. సెక్స్‌లో ఎక్కువసార్లు పాల్గొనాలనే ఆతృతతో చాలామంది తమ భాగస్వామిని బలవంతం చేస్తుంటారు. దాంతో వారు ఇష్టం లేకపోయినా.. తప్పని పరిస్థితుల్లోనే సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఇది వారి సంబంధాలను దెబ్బ తీస్తుంది. కాబట్టి ఇద్దరికీ నచ్చినపుడే సెక్స్‌కు సిద్ధపడాలి. అయితే సెక్స్‌ చేయకపోయినా ఇద్దరూ ఎక్కువ సమయం జంటగా గడపాల’ని పరిశోధకులు వెల్లడించారు.

    ఈ సర్వేలో నాలుగువేల అమెరికన్‌ జంటలు పాల్గొన్నాయి. వారిలో చాలామంది పై అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. దీనికి వయసుతో సంబంధం లేదని, అలాగే కొత్తగా పెళ్లయిన వారికైనా, పాత దంపతులకైనా ఇది వర్తిస్తుందని చెప్పారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రోజూ వద్దు.. వారానికోసారి ముద్దు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top