Translate

  • Latest News

    2, అక్టోబర్ 2019, బుధవారం

    పేరులో గాంధీ ఉంటే వారసులై పోరు...


    ఈ రోజు దేశ మంతటా మహాత్మా గాంధీ 150 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నాం.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు చోటా నాయకుడి నుంచి బడా నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ గాంధీజీ గురించి ఉపన్యాసాలు దంచేవారే... కానీ వారిలో కనీసం నూటికి ఒక్కరు కూడా గాంధీ చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టి పాటించేవారు లేరు... వారు సామాన్యులైనా... రాజకీయ నాయకులైనా... అందరూ అదే తీరు... సమాజం మొత్తం ఇలా ద్విముఖాలతో, ముసుగులు తొడుక్కుని బతుకుతున్నారు... మోహన్ దాస్ కరం చంద్ గాంధీ...  గాంధీ మహాత్ముడు గా ఎలా మారాడు.. తాను ఏది ప్రజలకు చెప్పాడో ... తన జీవితంలో అది ఆచరణలో చేసి చూపించాడు... అందుకే మహాత్ముడు అయ్యాడు... అలాంటి మహాత్మా గాంధీకి మనం ఇచ్చే నివాళి అంటే ఏమిటి... ఆయనకు జయంతులు... వర్ధంతులు జరపడం కాదు... ఆయన జీవిత కాలంలో ఏదైతే చెప్పారో...ఈ దేశం ఎలా ఉండాలని ఆశించారో... అది చేసి చూపించడం... మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్ళు అయినా గాంధీ కలలు కన్న రాజ్యం మనకు సిద్దించలేదు.... దీనికి కారణం ఎవరు.. మన రాజకీయ నాయకులు కాదా.. . మధ్యలో ఒకరిద్దరు నాయకులు గాంధీ ఆదర్శాలను పాటించడానికి ప్రయత్నం చేసినా చుట్టూ ఉన్న వ్యవస్థ అందుకు సహకరించక పోవడంతో వారు కూడా చేష్టలుడిగి కూర్చోవలసి వచ్చింది.  ఇటువంటి దేశంలో ఇప్పుడు ఒకే ఒక్కడు... రాజకీయాల్లో ప్రక్షాళనకు పూనుకున్నాడు...గాంధీజీ ఏది ఆశించారో... ఏదయితే ఈ రాజకీయ నాయకులంతా ఆచరణ సాధ్యం కాదని పక్కన పడేశారో... దానిని ఆచరణ సాధ్యం చేయడానికి నడుం కట్టాడు... గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నాడు... గాంధీ ఆశించిన మధ్య నిషేధాన్ని దశలవారీ అమలు చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు... అతడే మన ప్రియతమ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి... పేరులో గాంధీ ఉంటే గాంధీకి వారసులు కారు... ఆయన ఆశయాలను అమలు చేసిన వారే నిజమైన వారసులు..మన జగనే  మహాత్మా గాంధీకి నిజమైన వారసుడు.... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పేరులో గాంధీ ఉంటే వారసులై పోరు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top