Translate

  • Latest News

    10, ఏప్రిల్ 2020, శుక్రవారం

    అమెరికాలో రోడ్డున పడనున్న 3 లక్షల మంది ఇండియన్లు


    అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్ లను మినహాయిస్తే అక్కడ హెచ్ 1బి వీసా మీద ఉన్న ఇండియన్స్ కు పెను ముప్పు పొంచి ఉంది. అధికారిక అంచనాల ప్రకారం సుమారు 3 లక్షల మంది భారతీయులు ప్రస్తుతం అమెరికాలో హెచ్ 1 బి వీసాపై నివసిస్తున్నారు. వీరంతా అక్కడ ఏదో చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటున్నారు... వీరందరిపై ఇప్పుడు కరోనా పడగ విప్పనుంది... వీరిలో చాలామంది కరోనా కాటుకు బలి కాక తప్పని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న అమెరికాలో ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి సుమారు కోటి 66 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రతి పది మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు. స్థానికులకే ఉద్యోగాలు అన్న నినాదంతో గత ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కరోనా కల్లోలం నుంచి బయటపడ్డాక హెచ్ 1బి వీసాలపై కొరడా ఝుళిపించే అవకాశం ఉంది. సో.. అప్పుడు హెచ్ 1బి వీసా పై అమెరికాలో ఉన్న 3 లక్షల మంది ఇండియన్ల భవితవ్యం ప్రశ్నర్థకం లో పడే ప్రమాదం ఉంది. 
    అమెరికా మోజు ఇకనైనా తగ్గించుకుంటే  మంచిది 
    ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత, ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు తమ పిల్లలను ఇక్కడ బి.టెక్ పూర్తి చేయగానే ఎం.ఎస్ చేయడానికి అమెరికా పంపడమో.. లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగం పేరుతొ హెచ్ 1 బి వీసాపై  అమెరికా పంపించడం ఒక ఫ్యాషన్ గా తయారయింది. అమెరికాలో ఉద్యోగం చేస్తే ఇక్కడ ఇచ్చేదానికన్నా మూడు నాలుగు రేట్లు అధికంగా వేతనం వస్తుందని... ఇక్కడ పదేళ్లలో సంపాదించేది... అక్కడ నాలుగేళ్లలోనే సంపాదించవచ్చని...  కాసులపై మమకారంతో అమెరికాకు తోలేస్తున్నారు... ఇప్పటికయినా తల్లిదండ్రులు అమెరికాపై మోజును తగ్గించుకోవాలి. కేవలం సాఫ్ట్ వెర్  ఉద్యోగాలే కాకుండా అదే స్థాయిలో ప్రత్యామ్నాయ ఉద్యోగాలపై దృష్టి సారించాలి. తమ విద్యార్హతలకు అనుగుణంగా ఇండియాలోనే ఉన్న ఉద్యోగాలను ఎంపిక చేసుకోవాలి. తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలి. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు ఎన్నో రావచ్చు... దేశం కానీ దేశంలో దిక్కూ మొక్కూ లేని చావు చావడం ఎంత బాధాకరమే ఒక్క క్షణం ఆలోచించండి... అమెరికాలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య దాదాపు 17 వేలకు చేరింది. ఇందులో ఎంతమంది ఎన్ ఆర్ ఐ లు ఉన్నారన్నది ఇదమిద్దం గా తెలియడం లేదు కానీ... వందల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అమెరికన్లతో  పోలిస్తే మన వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన ఇండియన్లు వేలల్లో కరోనా బారిన పడినా కోలుకోగలిగారని తెలుస్తోంది. దీనికి ఒక కారణం ఏమిటంటే వారంతా చిన్నపుడు ఇండియాలో బి.సి.జి, మలేరియా  టీకాలు వేయించుకుని ఉండడం అని మన వైద్యులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఎన్ ఆర్. ఐ లూ బీ కేర్ ఫుల్... 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అమెరికాలో రోడ్డున పడనున్న 3 లక్షల మంది ఇండియన్లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top