Translate

  • Latest News

    23, ఏప్రిల్ 2020, గురువారం

    జర్నలిస్టులకు బీమా అవసరం లేదా...


    ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, ఏ.ఎన్ .ఎం.లు, గ్రామ, వార్డు వలంటరీలు, పోలీసులు వీరందరికి 50 లక్షల రూపాయల వరకు  బీమా సౌకర్యం కల్పిస్తానని రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది. ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి తమ బిడ్డల్ని కన్నతల్లిలా ప్రభుత్వం బాగానే చూసుకుంటుంది...మరి జర్నలిస్టుల సంగతో... వీరెవరికీ చెందని ఆనాధలు... పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు వీరిని కనిపడేసి... ఆ తర్వాత కుప్పతొట్లో వదిలేస్తే...గాలికి...ధూళికి పెరిగిన అనాధలు... అందుకే మండల స్థాయి సిబ్బంది కనీసం జీతాలు లేక.. గుడి మెట్ల మీద బిచ్చమెత్తుకునే యాచకులు లాగా... స్థానిక నాయకులు...లేదా ఇతర పెద్దలు విదిల్చే కాసుల కోసం వెంపర్లాడుతూ... అలా...అలా అడుక్కోవడానికే అలవాటుపడిపోయారు... క్షమించాలి... ఇది మన జర్నలిస్టులను నొప్పించే విషయమైనా...కటిక వాస్తవం... ఇంకెన్నాళ్లు వాస్తవాలను కప్పి పుచ్చి... పై పై మెరుగులతో ముఖాలపై లేని చిరునవ్వును తెచ్చిపెట్టుకుని మనల్ని మనం మోసం చేసుకుందాం... ఇప్పటికయినా నిజాలు నిర్భయంగా చెప్పుకుందాం...
    ఇప్పుడు మనమంతా కరోనా వార్తలు కవరేజీ చేస్తున్నాం.. ఓ పక్క ముంబై లో 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకిందట... తమిళనాడులో 40 మంది జర్నలిస్టులు కరోనా కోరలకు చిక్కారు... ఏకంగా ఒకే ఛానల్ లో పని చేసే 26 మందికి కరోనా పోజిటివ్ రావడంతో ఆ ఛానల్ మూసేశారంట. తెలంగాణాలో గద్వాల ఎన్.టీవీ  స్టాఫ్ రిపోర్టర్ కి కరోనా పాజిటివ్ వచ్చిందని విన్నాం.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న మన గురించి పట్టించుకునేదెవరు... అటు యాజమాన్యాలు పట్టించుకోవు... ఇటు ప్రభుత్వమూ పట్టించుకోదు. ఎవరికీ పట్టని అనాధల్లా ఉన్నాయి మన బతుకులు... మన గురించి మాట్లాడే నాధుడే లేదు... ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఒక్క బి.జె.పీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కడే అడిగారు జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలి... మీకు పరిపరి దండాలు సోదరా... కనీసం నువ్వయినా మమ్మల్ని మనుషులుగా గుర్తించావు.. అందరూ మమ్మల్ని కరివేపాకులా వాడుకుని వదిలేసే వారే తప్ప మా గురించి పట్టించుకునే వారే లేరు... యాజమాన్యాలు పట్టించుకోక పోగా ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నాయి. ప్రస్తుతం అవి సిబ్బందికి తొలగించే పనిలో బిజీ గా ఉన్నాయి... మిగిలిన సిబ్బందికి కూడా జీతాల్లో కోత పెట్టే పనిలో ఉన్నాయి... ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయి జర్నలిస్టులు కరోనా కు బలి కావడమో.... లేక దాని నుంచి తప్పించుకుంటే... ఆకలి చావులు చావడమో తప్పదు... 
    • Blogger Comments
    • Facebook Comments

    2 comments:

    Item Reviewed: జర్నలిస్టులకు బీమా అవసరం లేదా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top