Translate

  • Latest News

    5, మే 2020, మంగళవారం

    అజాగ్రత్తగా ఉంటే దేశంలో మరణ మృదంగం


    ఇండియా ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. దేశంలో కరోనా కోరలు చాస్తోంది. ప్రపంచంలో అగ్ర దేశాలు అన్నిటిని ముప్పతిప్పలు పెడుతున్న కరోనా ఇప్పుడు ఇండియాలో తన ప్రతాపాన్ని చూపెడుతోంది. వాస్తవానికి ఇండియాలో మొదటి కరోనా కేసు ఈ ఏడాది జనవరి 30 న కేరళలో వెలుగుచూసింది. అయితే నిన్న మొన్నటి వరకు దేశంలో రోజుకు వెయ్యి, 1200 కేసులు మాత్రమే నమోదు అవుతూ వచ్చాయి. ఒక్క సారిగా దేశంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆదివారం 2500 కేసులు నమోదు అవగా...సోమవారం ఆ సంఖ్య దాదాపు 4 వేలకు(3900)కు చేరడం భయాందోళనలకు గురిచేస్తోంది. ఆదివారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 40 వేలు దాటగా, సోమవారం నమోదు అయిన 3900 కేసులతో కలిపి ఒక్కసారిగా 46,433 కు చేరుకుంది. అంటే కేవలం 2 రోజుల్లో ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదే పద్దతి కొనసాగితే అతి త్వరలోనే రోజుకు 10000 కేసుల స్థాయికి చేరుకునే ప్రమాదం కనపడుతోంది. ఇండియాలో కరోనా కేసులు ఏప్రిల్ 14 నాటికి 10 వేలు ఉండగా, ఏప్రిల్ 22 నాటికి అంటే వారం రోజుల్లో 20 వేలకు చేరింది.  20 వేల  నుంచి 30 వేలకు చేరడానికి మళ్ళీ  7 రోజులు పడితే, 30 వేల నుంచి 40 వేలకు చేరడానికి 5 రోజులే పట్టింది. ఇప్పుడు 40 వేల నుంచి 46 వేలు అంటే 6 వేల కేసులు  2 రోజుల్లో వచ్చాయంటే మంగళవారం అర్ధ రాత్రి నాటికే  అంటే కేవలం 3 రోజుల్లోనే 50 వేల కేసులు దాటే ప్రమాదం స్పష్టంగా గోచరిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలో కూడా ఇదే విధంగా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. సో.. ఈ దశలో ప్రభుత్వాలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దేశంలో మరణ మృదంగం మోగడం ఖాయం. లాక్ డౌన్ నిభందనలు సడలించి కేవలం రెవెన్యూ కోసం మద్యం షాపులు తెరవడం అనేది వెర్రితనం. . తొలి రోజే చూసారుగా మద్యం ప్రియులు ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా ఎలా గుంపులు గుంపులుగా పోగుపడ్డారో... కరోనా కోరలు చాస్తున్న ఈ దశలో ఇలాంటి పిచ్చి చర్యలు  దేశాన్ని ప్రమాదంలో పడవేస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణం మద్యం షాపులు మూసి వేయించాలి. లేదంటే... దేశంలో మరణ మృదంగం ఖాయం.  
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అజాగ్రత్తగా ఉంటే దేశంలో మరణ మృదంగం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top