Translate

  • Latest News

    6, జూన్ 2020, శనివారం

    రౌడీయిజాన్ని కెరీర్ గా ఎంచుకుంటున్న యువత


    బెజవాడలో ఇప్పుడు ఒక కొత్త సంస్కృతి జడలు విప్పుతోంది. కొంతమంది కుర్రవాళ్ళు రౌడీయిజాన్ని కెరీర్ గా ఎంచుకుంటున్నారు. ఉద్యోగాలు... వ్యాపారాల కన్నా ఈజీగా మనీ సంపాదించే అవకాశాలు ఇందులోనే ఎక్కువగా ఉన్నాయని, పైగా... హీరోయిజం స్టేటస్ అనుభవించవచ్చనే అభిప్రాయం కూడా వాళ్లలో బలంగా వేళ్లూనుకోవడంతో రౌడీయిజాన్ని కెరీర్ గా ఎనుచుకుంటున్నారు. బెజవాడలో 30 ఏళ్ల కిందట సమాధి అయిందనుకున్న రౌడీయిజం ఆ తర్వాత అప్పుడప్పుడు సమాధి నుంచి లేచిన కాష్మోరాలా లేచి బుసలు కొడుతోంది. అయితే వారం  రోజుల కిందట బెజవాడలో రెండు కుర్ర గాంగ్ ల మధ్య జరిగిన గాంగ్ వార్ లో ఒక గ్రూప్ లీడర్ హత్యకు గురయ్యాడు. ఇప్పుడిప్పుడే సిటీలో రౌడీలుగా పేరు తెచ్చుకుంటున్న ఇద్దరు కుర్రాళ్ళ మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఒక గాంగ్ లీడర్ ప్రాణాలు కోల్పోయాడు. హత్యకు గురైన తోట సందీప్, ప్రత్యర్థి వర్గ లీడర్ కోడూరి మణికంఠ(పండు) ఇద్దరూ ఒకప్పుడు స్నేహితులే... కలసి రౌడీయిజం చేసిన వాళ్ళే.. ఎవరికి వారు తమ కెరీర్ లో ఎదగాలనుకుని సొంత గ్యాంగ్ లను మైంటైన్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒక డీల్ విషయంలో మధ్యవర్తి ఒకరికి తెలియకుండా ఒకరిని పిలవడం... అక్కడే నువ్వెందుకు వచ్చావంటే...నువ్వెందుకు వచ్చావని సందీప్, పండు వాదులాడుకోవడం, అదే చినికి చినికి గాలి వానై చివరకు నగర నడిబొడ్డున పట్టపగలు గ్యాంగ్ వార్ గా మారి సందీప్ హత్యకు దారి తీసింది.
    నగరంలో  30 ఏళ్ల కిందట  రెండు కుటుంబాలకు  చెందిన వారు  పరస్పరం తలపడి... ఒకరిని ఒకరు చంపుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముళ్లు ఆయా వర్గాలకు లీడర్లు అయి బెజవాడలో బీభత్సం సృష్టించారు.  ఇప్పుడు వారి వారసులు ప్రత్యక్ష రౌడీయిజం వదిలేసి, రాజకీయాలు, వ్యాపారాల్లో దిగి పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ తమ చేతులకు మట్టి అంటకుండా తమ ఆర్ధిక సంబంధమైన డీల్స్ కోసం ఇలాంటి కుర్ర గాంగ్ లను కరివేపాకులా వాడుకుంటున్నారు. గొడవలు, హత్యలు జరిగి పోతే పోయేది ఈ కుర్ర గాంగే తప్ప అసలు వాళ్లకు ఏమి కాదు. వారు సేఫ్ గా వుంటారు.ఈ కుర్ర రౌడీలు ఇందులో సంపాదన కంటే... ఆ రౌడీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తూ గడపడంలోనే ఆనందం అనుభవిస్తుంటారు. అందుకు పండూ ఇటీవల విడుదల చేసిన వీడియో నే నిదర్శనం. గత చరిత్ర పునరావృతం కాకుండా ఉండాలంటే... పోలీసులు తక్షణం చర్యలు తీసుకుని బెజవాడలో రౌడీయిజాన్ని కూకటి వేళ్ళతో పెకలించివేయాలి. లేదంటే మళ్ళీ వాళ్ళ తమ్ముళ్లు...వాళ్ళ తమ్ముళ్లు కక్షలు పెంచుకుని ఒకరిని ఒకరు చంపుకుని పాత చరిత్రను తిరగ రాస్తారు. ఆలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.  
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రౌడీయిజాన్ని కెరీర్ గా ఎంచుకుంటున్న యువత Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top