Translate

  • Latest News

    13, ఆగస్టు 2020, గురువారం

    అతిలోక సుందరి పుట్టిన రోజు



    ఆగస్టు 13. ఈ తేదీ అనగానే నాకు అతిలోక సుందరి శ్రీదేవియే గుర్తుకువస్తుంది. ఐదు పదుల వయసుకే మన నుంచి అంతర్ధానమైనది. 1963 ఆగస్టు 13 వ తేదీన దివి నుంచి భువికి దిగి వచ్చింది... తన 5 వ ఈడు నుంచి 55 వ ఏట వరకు అంటే ఐదు దశాబ్దాలు మనను  వెండి తేరపై అలరించి అదృశ్యం అయిపొయింది. భువి పైకి ఎలా వచ్చిందో... అలాగే తిరిగి దివి కేగింది. ఇంద్ర లోకంలో ఇంద్రుడు ఆమెను 55 ఏళ్ళు భూలోకంలో ఉండనివ్వడమే గొప్ప మరి...
    9 యేళ్ల వయసులో బూచోడమ్మా... బూచోడమ్మా... అంటూ   బేబీ శ్రీదేవి మనల్ని ఎలా  మంత్ర ముగ్దుల్ని చేసిందో... 15 యేళ్ల వయసులో 16 యేళ్ల వయసు సినిమాలో యూత్ ని గిలిగింతలు పెట్టింది... ఇక ఆ తర్వాత 16 యేళ్ల వయసు వచ్చాక వేటగాడు లో ఆకు చాటు అందాలు ఆరబోసింది. ఇక అప్పటి నుంచి కుర్రాళ్ళకి నిద్రపడితే ఒట్టు.. ఇక 1990 కి వచ్చేసరికి 27 యేళ్ల వయసులో అతిలోక సుందరిగా తన అసలు రూపం దేవకన్య గా కనపడి అందరిని సంభ్రమాత్సర్యాలకు గురిచేసింది. అతిలోక సుందరి పుట్టిన రోజు
    భూమ్మీద పుట్టినాక సీతమ్మ తల్లికే కస్టాలు తప్పలేదు... ఇక మన శ్రీదేవి కి మాత్రం తప్పుతాయా... ఆమె నిజ జీవితంలో ఎన్నో కస్టాలు పడింది. కోరుకున్న వారంతా ఒకరి తర్వాత ఒకరు దూరం అయ్యారు... విధి లేని పరిస్థితుల్లో బోణీకవూర్ ని రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎన్ని కస్టాలు పడినా బాధ నంతా తనలోనే దిగమింగుకుంది కానీ ఎవరికీ చెప్పుకోలేదు... 55 యేళ్ల వయసులో దేశం కానీ దేశంలో అంతర్ధానం అయింది. అటు నుంచి ఆటే తన దేవలోకానికి తరలిపోయింది. ఆ దేవత మనల్ని వీడి రెండేళ్లు దాటినా... ఆ తలపులు ఇంకా పచ్చి గాయంలా బాధ పెడుతూనే ఉన్నాయి. ఈ రోజు ఆమె పుట్టిన రోజు... (దేవతలను జయంతి ఆనం కదా... పత్రికా భాషలో). భువిలో  ఉంటె 57 నిండి 58 వచ్చి ఉండేవి... ఏమంత వయసుని అప్పుడే మాకు దూరం అయ్యావు... దేవీ... దేవీ మౌనమా... శ్రీదేవీ మౌనమా... అంటూ  ఈ రోజంతా  నిన్ను తలచుకుంటూ కాలం గడపడం కంటే ఇంకా ఎం చేయగలం... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అతిలోక సుందరి పుట్టిన రోజు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top