Translate

  • Latest News

    15, ఆగస్టు 2020, శనివారం

    రూపు మార్చుకుంటున్న అంటరానితనం



    73 యేళ్ల స్వాతంత్ర్యం అనంతరం కూడా దేశంలో ఇంకా అంటరానితనం ఏదో ఒక రూపేణా కొనసాగుతూనే ఉంది...  దేశంలో   తె ల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చినట్టుగా... ఒకప్పుడు పెత్తనం చేసిన బ్రాహ్మణ వర్గం స్థానే... ఏ బ్రాహ్మణ వాదాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారో... ఆ శూద్ర వర్గాల నుంచి వచ్చిన కమ్మ, రెడ్డి, వెలమ వర్గాలే నయా బ్రాహ్మణ వాదులుగా చెలామణి అవుతున్నట్టుగానే... అంటరానితనం కూడా తన రూపు మార్చుకుంది... ఈ రోజు స్వాతంత్ర్య దిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆ మాటే చెప్పారు. సామాజికంగా అభివృద్ధి చెందిన కొన్ని కులాలు... స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లయినా ఇంకా సామాజికంగా వెనుకబడిన కులాల్ని ఎదగనీయకుండా ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను వ్యతిరేస్తున్నాయని... ఇది కూడా ఒక రకమైన అంటరాని తనమేనని... ఇందులో వాస్తవం లేకపోలేదు... సమాజంలో కొన్ని కులాలు శాశ్వతంగా సేవకులుగానే ఉండాలని... వారు తరతరాలు తమకు సేవలు చేస్తూనే ఉండాలని సమాజంలో కొన్ని అగ్రవర్ణాల్లో అంతర్లీనంగా ఉన్న భావన.. వారు మంచి చదువులు చదువుకుని ఎదిగిపోతే ఇంకా తమకు సేవలు చేసేవారెవరూ ఉండరని దిగులు... అందుకే బడుగులు బడుగులు గానే ఉండాలని... వారు బలాఢ్యులుగా మారితే తమ పునాదులు కదిలిపోతాయనే భయం... ఈ భయాలు...దిగుళ్ళతోనే వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు... దీనికి తెలుగు భాష ఉద్ధరణ అనే ఒక అందమైన ముసుగు తొడుగుతారు... వారికి కొందరు అభ్యుదయ వాదులు... కమ్యూనిస్టులు (ఆ)మాయకంగా మద్దతు పలుకుతారు...  ఇదంతా చూస్తున్న తర్వాత నేటి సమాజంలో చాలామందికి  ఇంకా తమకు నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా అన్న అనుమానం కలుగుతోందంటే ఆశ్చ్చర్యం పడాల్సిన పని లేదు.

    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    1. If you're be} new to or planning to maneuver into this business, it may allow you to higher perceive this market opportunity when you a glance at|have a look at} different types of|several sorts of|various sorts of} genres and the way they are classified. Retail sports betting was legalized in December 2021 in Maryland. While more licenses have since been made obtainable, there are currently four sportsbooks open and operational in the Old Line 카지노 State. When sports bettors in Maryland gain access to the FanDuel sportsbook, they’ll be part of their peers across the nation find some of the the} finest worth strains on the market.

      రిప్లయితొలగించండి

    Item Reviewed: రూపు మార్చుకుంటున్న అంటరానితనం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top